Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఈ సారి అదిరిపోయే ట్విస్ట్..!

బిగ్ బాస్ OTT 3 2024 లో త్వరలోనే రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూన్ 4 లేదా 5 నుంచి 'బిగ్ బాస్ OTT 3' ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 25న అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

New Update
Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఈ సారి అదిరిపోయే ట్విస్ట్..!

Bigg Boss OTT 3: హిందీ బిగ్ బాస్ OTT 3' 2024 త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ తెలిపారు. అయితే తాజాగా ఓటీటీ షో విడుదల తేదీ, బిగ్ బాస్ 18' ప్రీమియర్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈసారి 'బిగ్ బాస్ OTT' 60 రోజుల్లో ముగియనుందని అంటున్నారు.

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్నారు

బిగ్ బాస్ OTT 3' ప్రీమియర్ జూన్‌లో షెడ్యూల్ చేయబడిందని ప్రచారం జరుగుతోంది. జూన్ 4 లేదా 5 నుంచి 'బిగ్ బాస్ OTT 3'స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో ఫైనల్స్  నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ రియాలిటీ షోను ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ చేస్తారని, అలాగే ప్రేక్షకులను మరింత  అలరించడానికి మేకర్స్ సరి కొత్త మలుపులు, ట్విస్టులతో షో ప్లాన్ చేసినట్లు సమాచారం.

publive-image

ఏప్రిల్ 25న ప్రకటన వెలువడనుంది

బిగ్ బాస్ OTT 3' ముగిసిన తర్వాత, మేకర్స్ 'బిగ్ బాస్ 18' కోసం సన్నాహాలు ప్రారంభిస్తారని టాక్ . సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో 'బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. అయితే, బిగ్ బాస్ OTT 3', 'బిగ్ బాస్ 18' ప్రీమియర్‌లకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వీటికి సంబంధించి ఏప్రిల్ 25న ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Satyabhama Movie: ‘సత్యభామ’ వచ్చేస్తుంది.. మూవీ రిలీజ్ ఆరోజే..?

Advertisment
తాజా కథనాలు