Himachal Pradesh Politics: డేంజర్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌.. కూల్చేందుకు బీజేపీ కుట్రలు!

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ MLAలు బీజేపీలో చేరగా.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.

Himachal Pradesh Politics: డేంజర్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌.. కూల్చేందుకు బీజేపీ కుట్రలు!
New Update

Himachal Pradesh Politics: లోక్ సభ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. కేంద్రంలో అధికారంలో ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లోక్ సభ ఎన్నికలకు ప్రచారం మొదలు పెట్టారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిని బలపరిచే పనిలో పడింది. కాంగ్రెస్ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు భారత్ న్యాయ్ జోడో యాత్ర చేపట్టారు.

ALSO READ: ఈనెల 29న బీజేపీ తొలి జాబితా?

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ డేంజర్..

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆపరేషన్‌ కమల్‌ మొదలు పెట్టింది బీజేపీ. ప్రస్తుతం అక్కడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ డేంజర్ లో ఉంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీకి మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకుంది. కాషాయ పార్టీలో చేరేందుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఎంపీ ఎన్నికలకు ముందే..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-25, కాంగ్రెస్‌-40, ఇతరులు-3 స్థానాలు కైవసం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలకు మ్యాజిక్‌ ఫిగర్‌ - 35 సీట్లు గెలవాలి. ప్రస్తుతం బీజేపీకి 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెన్నుపోటు?..

హిమాచల్ ప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌కు అనుకూలంగా 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓటు వేసినట్లు తెలుస్తోంది. 2022లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు హర్ష్‌ మహాజన్‌. ఒకవేళ ఇదే జరిగితే ఉత్తరాదిలో కాంగ్రెస్ కనుమరుగు అవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

#bjp #modi #himachal-pradesh-politics #himachala-pradesh #congress-in-danger
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe