Sharia law: 'సనాతన ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు'? కాంగ్రెస్, బీజేపీ మధ్య ముదురుతున్న వార్! హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. By Trinath 23 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మతాల చుట్టూ రాజకీయాలు చేయడం దేశంలో పొలిటికల్ పార్టీలకు అలవాటు. ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంక్‌కు వాడుకోవడం ప్రధాన పార్టీలకు కొట్టినపిండే. ఇందులో ఏ పార్టీ తక్కువ కాదు. ఈ ఏడాది కర్ణాటక ఎన్నికలు జరగడానికి ముందు వరకు ఆ రాష్ట్రంలో హిజాబ్ ఇష్యూ తీవ్ర వివాదాస్పదమైంది. కాలేజీల్లో, స్కూల్స్‌లో హిజాబ్ ధరించడాన్ని నాటి బీజేపీ సర్కార్ నిషేధించింది. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో కాంగ్రెస్ ఇదే అస్త్రంతో ఎన్నికల్లో ప్రచారం చేసింది. ముస్లింలను తమవైపునకు తిప్పుకుంది. ఇక తాజాగా అప్పటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపడేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. బీజేపీ అటాక్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లింలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఈ తరహా రాజకీయాలకు దిగుతోందని ఆరోపించింది. కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల రాష్ట్రంలో షరియా చట్టం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే దేశవ్యాప్తంగా ఇస్లామిక్ చట్టం అమలులోకి వస్తుందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, INDIA కూటమి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇస్లామిక్ చట్టం అమలు చేస్తారని.. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. సిద్ధరామయ్య ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పొందాలని ఆయన భావిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీలను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారని బొమ్మై ఫైర్ అయ్యారు. నిజానికి 2022లో బీజేపీ-బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధించిన తర్వాత రాష్ట్రంలో నెల రోజుల పాటు వివాదం నెలకొంది. ఈ ఉత్తర్వుపై పిటిషన్లు దాఖలైన తర్వాత, కర్ణాటక హైకోర్టు కూడా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని, రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ పాటించాలని కోర్టు పేర్కొంది. Also Read: ‘ఫైటర్’లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా! WATCH: #karnataka #sharia-law మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి