Higher Studies: చదువు ముఖ్యమని మన తల్లిదండ్రులు, పెద్దలు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉంటారు. జీవితంలో విద్య చాలా ముఖ్యం. అది మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది అనేది నిజం. బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి ఉద్యోగం వస్తే ఎక్కువ డబ్బు సంపాదిస్తానని దీని వల్ల మంచి జీవితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఓ అధ్యయనంలో ఎక్కువ చదువులు చదివితే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని తేలింది.
ఈ అధ్యయనం ఏం చెబుతోంది?
- ఇటీవల న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉన్నత విద్య వయస్సును ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం కోసం 1948 నుంచి మూడు తరాల నుంచి వేలాది మంది వ్యక్తుల డేటాను సేకరించారు. ఇందులో పాల్గొన్నవారి రక్త నమూనాలను సేకరించారు. రక్తం సహాయంతో ఆ వ్యక్తుల జన్యుసంబంధ డేటాను విశ్లేషించారు. ఇందులో తెల్ల రక్త కణాలలో DNA ద్వారా వృద్ధాప్య వేగాన్ని కొలిచారు. జన్యు స్థాయిలో ఒక వ్యక్తి ఎంత వేగంగా వృద్ధాప్యానికి వస్తున్నాడో తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో తక్షణం ఎనర్జీ ఇచ్చే డ్రింక్.. తాగితే వదలరు..!
అధ్యయనంలో ఏం తేలింది..?
- రక్త నమూనాలను విశ్లేషించిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎక్కువ కాలం జీవించారని, అంతేకాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా ఉన్నారని తేలింది. ఈ అధ్యయనం JAMA నెట్‌వర్క్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఉన్నత విద్య వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందని, మరణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఎంత తాగినా మీ లివర్ సేఫ్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.