TS: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్.. నేతల మధ్య ఘర్షణ! మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజీపీలోకి వెళ్లొద్దంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పొటాపోటిగా నినాదాలు చేశారు. హరీష్‌రావు ఆదేశాలతో రమేష్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు. By srinivas 13 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లే యోచనలో నిన్న అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. కాగా రమేష్ ఈ రోజు హనుమకొండలో తన ఇంటివద్ద ప్రెస్ మీట్ కు ముందు భారీ సంఖ్యలో రమేష్ ఇటికి చేరకున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లొద్దంటూ బుజ్జగింపులు మొదలుపెట్టారు. ప్రెస్‌మీట్‌కు బ్రేక్.. ఈ మేరకు రమేష్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడిన హరీష్‌రావు సైతం పునరాలోచించాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ప్రెస్‌మీట్‌కు బ్రేక్ ఇచ్చి చర్చలు జరిపిన ఆరూరి రమేష్.. చివరి నిమిషంలో వస్తే ఎలా అంటూ రమేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటూ బీఆర్ఎస్ నేతలు రమేష్ ను మెత్తపడగొట్టేందుకు ప్రయత్నించారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. ఇది కూడా చదవండి: Breaking: ఈనెల 16న వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ప్రకటన! ఈ క్రమంలో ‘జై ఆరూరి’ అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు. చివరగా రమేష్‌ను కారులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇక బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న క్రమలోనే రమేష్ ఈ నిర్ణయం తీసుకోగా.. రమేష్ దారి ఎటువైపు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. #brs #bjp #high-tension #former-mla-aruri-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి