కొత్తగూడెంలో హైటెన్షన్‌.. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం

సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సాంబశివరావును ప్రధాన కార్యాలయంలోకి అనుమతించపోవడంతో ఏఐటీయూసీ కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు.

New Update
కొత్తగూడెంలో హైటెన్షన్‌.. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతల మధ్య వాగ్వాదం

సింగరేణి ఎన్నికల నేపథ్యంలో హైటెన్సన్ వాతావరణం నెలకొంది. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ (AITUC), సీఐటీయూ (CITU) నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎలక్షన్స్ ప్రచారానికి ఈ రోజు చివరిరోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) మంత్రి హోదాలో కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడం వివాదాలకు దారితీసింది.

అయితే మొదట ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Koonanneni Sambasivarao) కు ప్రధాన కార్యాలయంలోకి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏఐటీయూసీ, కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఏఐటీయూసీ అధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు. అధికారులు ఎందుకిలా చేశారంటూ సెక్యూరిటీ సిబ్బందితో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాగ్వాదానికి దిగారు. తమను కూడా లోపలికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఇది సరైన పద్ధతి కాదంటూ కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న సింగరేణి డైరెక్టర్‌ బలరాం  పా అక్కడకు చేరకుని సెక్యూరిటీ చీఫ్, సిబ్బందిపై సీరియస్ అయ్యారు. అనంతరం సాంబశివరావును లోపలికి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది.

ఇది కూడా చదవండి : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి

ఇదిలావుంటే.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, సీపీఎంలు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీపడుతున్న ఏఐటీయూసీ, సీఐటీయూల పార్టీ గెలుపుకోసం ఎవరికి వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ సింగరేణి ఎన్నికలు ఇరు పార్టీల మధ్య చిచ్చు రాజేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టియుసి సంఘం గెలుపుకోసం పార్టీ కృషి చే స్తోంది. గతంలో రెండు పర్యాయాలు విజయం సా ధించిన బిఆర్‌ఎస్ అనుబంధ బొగ్గుగని కార్మిక సం ఘం మరోసారి గెలిచి హ్యాట్రిక్ కోట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ ఈ ఎన్నికల్లో వేర్వేరు గా పోటీ చేస్తూ కలబడటం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులున్నారు. బిఆర్‌ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాం గ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.సిఐటియు, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం పాకులాడుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు