/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Kethireddy-Pedda-Reddy.jpg)
High Tension At Tadipatri : తాడిపత్రి (Tadipatri) లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) ప్రత్యేక్షమయ్యారు. పోలీస్ స్టేషన్‌లో టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్‌ని కలిశారు. కండిషన్ బెయిల్‌కు సంబంధించి సంతకాలు చేయడానికి పెద్దారెడ్డి వచ్చారు. దాదాపు 50 రోజుల తర్వాత తాడిపత్రిలో కనిపించారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి సడెన్‌గా కనిపించడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. అనంతరం తాడిపత్రి నుండి అనంతపురం (Anantapur) కు బయలుదేరారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డిని పోలీసు వాహనాలు ఫాలో అవుతున్నాయి. పెద్దారెడ్డిని జిల్లా ఎస్పీ వద్ద హాజరు పరచనున్నట్లు సమాచారం.
Also Read : ఎల్లుండి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ