Singareni Elections: తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మరో ఎన్నిక జరగనుంది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించింది హైకోర్టు. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో, డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాయి.
ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..
అయితే, ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్రభుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డ హైకోర్టు... ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: విద్యుత్ రంగం అప్పు రూ.81,516 కోట్లు.. భట్టి సంచలన రిపోర్ట్!