/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
ఏపీలో పలు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ పెట్టాలని మంత్రి అంబటి రాంబాబు పటీషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని.. హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ పెట్టాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈయన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది.