Hidden Facts About Kashi Viswanath: ప్రపంచంలోని పురాతన నగరాలలో కాశీ ఒకటి. ఇక్కడి ఘాట్‌లను, గంగా హారతిని చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారణాసిలోని 12 జ్యోతిర్లింగాలలో విశ్వనాథుడు ఒకరు. వారణాసిలోని ఆధ్యాత్మిక అందాలు అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఈ నగరం ఎంత అందంగా ఉందో అంతకు మించి రహస్యాలను కలిగి ఉంది. కాశీకి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
➡ కాశీని శివుని నగరం అంటారు. శివుడు కాశీని ఎంతగానో ప్రేమిస్తాడని చెబుతుంటారు. శివుడు ఇక్కడ నివసిస్తున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇక్కడ చాలా పురాతనమైన జ్యోతిర్లింగం ఉంది. కాశీకి సంబంధించిన పౌరాణిక నమ్మకం ప్రకారం.. ఇది మహాదేవుని త్రిశూలం మీద నిర్మించారు..
➡ పురాణాల ప్రకారం, హిందూ మతం కాశీలోనే స్థాపించబడింది. కాశీ హిందూ సంస్కృతికి కేంద్రంగా ఉంది.
➡ బనారస్‌లో కాలభైరవుని ఆలయం ఉంది. కాల భైరవుని దర్శనం లేకుండా ఏ ఆత్మ కూడా మోక్షాన్ని పొందదని ఒక నమ్మకం కూడా ఉంది. మోక్షాన్ని పొందేందుకు, కాలభైరవుడిని దర్శించుకుంటారు.
➡ బనారస్‌లో అడుగడుగునా దేవాలయాలు ఉన్నాయి. బనారస్‌లో 72,000 దేవాలయాలు ఉన్నాయని, ఇది మానవ శరీరంలోని నరాలకు సమానమని చెబుతారు.
➡ మనకు వారణాసిని బనారస్, కాశీ అనే పేర్లతో పిలుస్తారని తెలుసు. కానీ దీనికి అనేక ఇతర పేర్లు ఉన్నాయి. బనారస్‌ని మహాశంషణ్, అవిముక్త, రుద్రవస్ , ఆనందవన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. బనారస్‌లో మరణించినవాడు మోక్షాన్ని పొందుతాడని భక్తుల నమ్మకం.
➡ బనారస్‌లో లోలార్క్ అనే నీటి చెరువు ఉంది. ఈ చెరువులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. దీని ప్రస్తావన స్కాంద పురాణంలో కూడా ఉంది. భాదౌ మాసంలో సూర్యకిరణాలు లోలార్క్ కుండ్‌పై పడతాయి. ఈ సమయంలో ఈ చెరువులో స్నానం చేసిన స్త్రీకి సంతానం కలిగిన సంతోషం కలుగుతుందని నమ్ముతారు.
Also Read: 472 పోస్టుల భర్తీకి టీటీడీ ఆమోదం.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు!