Hi Nanna Trailer: వీడెవడో బావున్నాడే అనిపిస్తోంది అంటున్న నానీ.. 

నేచురల్ స్టార్ నానీ కొత్త సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. థీరియాట్రికల్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు నానీ. సినిమాతో అందరూ ప్రేమలో పడతారు అంటూ నానీ హామీ ఇస్తున్నాడు. 

New Update
Hi Nanna Trailer: వీడెవడో బావున్నాడే అనిపిస్తోంది అంటున్న నానీ.. 

Hi Nanna Trailer: అసలు ఈ ట్రైలర్ లో నన్ను నేను చూసుకుంటే అబ్బా ‘’వీడెవడో బాగున్నాడే’’ అని నాకే అనిపించింది అంటున్నాడు నేచురల్ స్టార్ నానీ (Nani). హాయ్ నాన్న సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నానీ. ఈ సినిమా థీరియాట్రికల్ ట్రైలర్ విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతోంది. ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా నానీ మాట్లాడుతూ ఎవ్వరూ ఊహించనిది… ఇప్పటివరకూ టీజర్.. ట్రైలర్ లలో చూడనిది సినిమాలో బోలెడు ఉందని చెప్పాడు. సినిమా నాకు ఆక్సిజన్ లాంటిది.. అంటున్న నానీ డిసెంబర్ 7వ తేదీన అందర్నీ ప్రేమలో పడేసే సినిమా వస్తుంది. దాని గ్యారెంటీ నాది. మా సినిమా టీమ్ అందరిదీ ఆ బాధ్యత అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేశాడు నానీ. సినిమా హిట్ చేసే బాధ్యత ప్రేక్షకులది.. ఈ సినిమా చూసి ప్రేమలో పడిపోయి హిట్ చేసే బాధ్యత ప్రేక్షకులే తీసుకుంటారు అంటూ ధీమా వ్యక్తం చేశాడు నానీ.

నేను కొత్తదనాన్ని ప్రయత్నం చేసిన ప్రతిసారి అందరూ ఇది తెలుగు ప్రేక్షకులు చూడరు.. ఇలా ఉంటే వారికీ నచ్చదు.. రిస్క్ తీసుకుంటున్నావు.. ఇలా చెబుతూ రావడం జరుగుతూనే ఉంది. కానీ, ప్రతిసారి ప్రేక్షకులు ఆ కొత్తదనాన్ని ఆదరించి నన్ను తమ ఇంటివాడిలా చూస్తూ వస్తున్నారు. ఆ మాటలన్నీ తప్పు అంటూ నిరూపిస్తూనే ఉంటున్న ప్రేక్షకులు ఉండడం మా అదృష్టం అని చెప్పారు. మొత్తమ్మీద హాయ్ నాన్న సినిమా తన కెరీర్ లో బెస్ట్ గా ఉంటుందని గ్యారెంటీ ఇచ్చేశాడు నానీ. 

Also Read: తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ ‘హాయ్ నాన్న’: ట్రైలర్ రిలీజ్

ఓ చిన్నారి.. అనగనగా ఒక ఊరు.. అందులో నేను అంటూ ఒక కథ చెప్పాడు నాన్న. నాన్న చెబుతోంది నా గురించే అంది ఆ చిన్నారి. మళ్ళీ ఇంకో కథ చెప్పాడు ఆ నాన్న.. ఈసారి ‘ఈ కథలోనూ అమ్మ లేదా నాన్నా?’ అని బేలగా అడిగింది ఆ బుజ్జాయి. కట్ చేస్తే.. ఇంకో సీన్ మళ్ళీ నాన్న కథ మొదలు పెట్టాడు.. నేనే నాన్న అంటూ. మరి అమ్మ గా ఎవరిని ఊహించుకోను అడిగింది పాప.. ఇదిగో ఈమెని అంటూ ఎదురుగా ఉన్నామెను చూపించేశాడు ఠకీమని.. ఇంతకీ ఆమె ఎవరు? ఈ అమ్మలేని నాన్న కథ ఏమిటి? ఆ పాప తల్లి ఎవరు? ఇన్ని ప్రశ్నలు ఒకేసారి  ప్రేక్షకులకు వచ్చేలా చేసింది హాయ్..నాన్న(Hi Nanna Trailer) థీరియాట్రికల్ ట్రైలర్. కచ్చితంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవలసిందే అనే ఉత్కంఠ తీసుకు వచ్చింది. 

 నాని కథానాయకుడిగా.. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయికగా తెరకెక్కిన ఈ సినిమాలో బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డా.విజేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి శౌర్యువ్‌ దర్శకుడు. డిసెంబరు 7న తెలుగుతోపాటు, తమిళ,  కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాకి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు