MLA KTR: కేటీఆర్ పోస్టు.. నీకో దండం అంటూ సమంత కామెంట్!

కేటీఆర్ పెట్టిన ఓ పోస్ట్ కు హీరోయిన్ సమంత కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ ఉండాలి అని కేటీఆర్ పోస్ట్ చేయగా.. రెండు చేతులు జోడిస్తూ నమస్కారం చేసే ఈమోజీ సమంత కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత కామెంట్ వైరల్‌గా మారింది.

New Update
MLA KTR: కేటీఆర్ పోస్టు.. నీకో దండం అంటూ సమంత కామెంట్!

MLA KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజూ దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు సోషల్‌ మీడియాలో గడుపుతానని గతంలో ఆయనే ప్రకటించారు. నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతూ.. నెటిజన్ల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వార్తల్లో నిలిచే కేటీఆర్‌.. గురువారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. ''జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో దాన్ని ఎదుర్కొవాలి'' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇదే సాధారణ విషయమే అయినప్పటికీ.. దానికి వచ్చిన రిప్లైపైనే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కేటీఆర్‌ పెట్టిన పోస్టుకు హీరోయిన్‌ సమంత రిప్లై ఇచ్చారు. దండం పెడుతూ ఎమోజీని పోస్టు చేశారు. అనంతరం ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీనిపై సోషల్‌ మీడియాలో రకరకాల స్పందనలు వెలువడుతున్నాయి. కేటీఆర్‌ పెట్టిన ఈ పోస్టు హీరోయిన్‌కు బాగా కనెక్ట్‌ అయిందని.. అందుకే సమంత స్పందించారంటూ ఆమె అభిమానులు చర్చలు జరుపుతున్నారు.

publive-image

View this post on Instagram

A post shared by KTR (@ktrtrs)

#phone tapping case #mla-ktr #samantha
Advertisment
Advertisment
తాజా కథనాలు