Yash: నిర్మాతగా యష్ ఎంట్రీ.. నమిత్ మల్హోత్రాతో 'రామాయణ' మూవీ..! కన్నడ స్టార్ హీరో యశ్ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న'రామాయణ' మూవీకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. యశ్ హోం బ్యానర్ మాన్‌స్టర్ మైండ్, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. By Archana 12 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Yash: నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా 'రామాయణ' మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మాతగా యశ్ ఎంట్రీ అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ విపిస్తోంది. కేజీఎఫ్ సినిమాతో నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నితేశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ ,యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీని ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యశ్ రావణుడిగా ప్రధాన పాత్రలో నటిస్తూనే.. నిర్మాతగా వ్యవహరించడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. BIGGG DEVELOPMENT… YASH JOINS HANDS WITH NAMIT MALHOTRA TO PRODUCE ‘RAMAYANA’… This is a groundbreaking collaboration… #NamitMalhotra and actor #Yash have joined forces to produce the epic saga #Ramayana for #Indian and global audiences.… pic.twitter.com/jbMcIBzVZ5 — taran adarsh (@taran_adarsh) April 12, 2024 టాక్సిక్ మూవీ ప్రస్తుతం యశ్ గీతూ దాస్ దర్శకత్వంలో ' టాక్సిక్ ' మూవీ చేస్తున్నారు. కేవీఎన్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే 'A Fairy Tale For Grown Ups' ట్యాగ్ లైన్ తో విడుదలైన గ్లింప్స్ భారీ అంచనాలను పెంచేసింది. Also Read: Bhaje Vaayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ #hero-yash #ramayana-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి