Venkatesh: 'F2' కాంబో మరో సారి రిపీట్.. అంతేగా అంతేగా..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వెంకీ మామ తన నెక్స్ట్ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఉగాది సందర్భంగా పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించనున్నారని సమాచారం.

New Update
Venkatesh: 'F2' కాంబో మరో సారి రిపీట్.. అంతేగా అంతేగా..!

Venkatesh - Anil Ravipudi Movie: టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ వరుస సినిమాలు, సీరీస్ లు చేస్తూ బిజీగా సాగుతున్నారు. రీసెంట్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకీ మామ 75వ చిత్రంగా భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అభిమానులకు నిరాశే మిగిల్చింది. దీంతో వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఏంటని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: Pooja Hegde: పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? వీడియో వైరల్

Venkatesh - Anil Ravipudi Movie

అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబో

ఈ క్రమంలో వెంకీ మామ నెక్స్ట్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. F2, F3 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, వెంకీ కాంబో మరో సారో రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు వచ్చినట్లు సమాచారం. అయితే ఉగాది సందర్భంగా పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించనున్నారట. దీని పై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. F2, F3 తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో మరో సారి రిపీట్ కావడం, ఇప్పటివరకు ఒక్క ప్లాప్ లేని అనిల్ డైరెక్ట్ చేయడం సినిమా పై ఆసక్తిని పెంచుతోంది.

Also Read: Priyanka Chopra: తమ్ముడి పెళ్ళిలో ప్రియాంక చోప్రా డ్రెస్ చూస్తే.. మతిపోవాల్సిందే..!

Advertisment
తాజా కథనాలు