Operation Valentine: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న రిలీజైన ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం .

New Update
Operation Valentine: అప్పుడే  ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Operation Valentine: వరుణ్ తేజ్, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కలిసి జంటగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. డెబ్యూ డైరెక్టర్ శక్తికాంత్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ నిర్మించారు. ట్రైలర్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 14 పుల్వామా ఎటాక్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇప్పటికే గాండీవదారి అర్జున, గని సినిమాలతో  ప్లాప్స్ అందుకున్న వరుణ్ కు ఈ సినిమా మరో డిజాస్టర్ ను మిగిల్చింది. ఇక థియేటర్ రిజల్ట్స్ కారణంగా విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Tovino Thomas: ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినో థామస్

ఓటీటీలో వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్

ఆపరేషన్ వాలెంటైన్  స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ  భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

publive-image

ఆపరేషన్ వాలెంటైన్ స్టోరీ

అర్జున్ రుద్ర దేవ్ (వరుణ్ తేజ్ ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ వజ్ర కోసం రుద్ర చేసిన సాహసం కారణంగా అతడి స్నేహితుడైన కబీర్ (నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ప్రాజెక్ట్ వజ్రను అధికారులు బ్యాన్ చేస్తారు. 2019 ఫిబ్రవరి 14న కాశ్మీర్ లో జరిగిన పుల్వామా దాడుల పై రివెంజ్ తీసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్టైక్ చేస్తుంది. ఈ స్ట్రైక్ తర్వాత ఇండియా పై రివెంజ్ తీర్చుకోవడానికి పాకిస్థాన్ సీక్రెట్ కోడ్ పేరుతో ఎలాంటి కుట్రలు చేసింది..? ఆపరేషన్ వాలెంటైన్ మిషన్ ద్వారా రుద్ర పాక్ దాడులను ఎలా భగ్నం చేశాడు..? అనేదే ఈ సినిమా కథ.

Also Read: Naga Chaitanya: ‘తండేల్’ సెట్స్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కేక్ కట్టింగ్.. ఎవరి కోసమో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు