Hero Surge: ఆటో నడుపుకుంటూ వెళ్లి.. దానిని ఒక పక్కగా పార్క్ చేసుకుని.. దాని నుంచి బైక్ బయటకు తీసి రయ్ అంటూ మార్కెట్లోకి దూసుకుపోతే ఎలా ఉంటుంది? అర్ధం కాలేదా? ఒక ఆటోడ్రైవర్ ఉన్నారనుకుందాం. ఆటను మధ్యాహ్నం దాకా సిటీలో ఆటో నడిపి. లంచ్ కి ఇంటికి మళ్ళీ ఆటో తీసుకుని వెళ్లాలంటే ఆ ట్రాఫిక్ లో ఎంత టైమ్ వేస్తావుతుంది? అలా కాకుండా తన ఆటో స్టాండ్ లో ఆటో వదిలేసి బైక్ మీద ఇంటికి వెళితే ఎంత బావుంటుంది? కానీ, బైక్.. ఆటో రెండూ కొనాలంటే డబ్బు ఖర్చు ఎక్కువే. అలా రెండిటినీ ఒకేసారి తీసుకువెళ్ళలేడు కదా. ఇలాంటి తిప్పలు లేకుండా ఆటో, బైక్ రెండిటినీ కలిపేస్తే.. ఆ ఊహే వెరైటీగా అనిపిస్తోందా? ఆ ఊహను నిజం చేస్తోంది హీరో మోటో కార్ప్.
హీరో మోటోకార్ప్ త్రీవీలర్.. టూ వీలర్‌గా పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాన్ని (Hero Surge)పరిచయం చేసింది. సింపుల్ గా చెప్పాలంటే, మూడు చక్రాల వాహనాన్ని ద్విచక్ర స్కూటర్‌గా కూడా మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. హీరో దీనికి సర్జ్ అని పేరు పెట్టింది. జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ 2024లో హీరో సర్జ్ S32 (సర్జ్) మల్టీ-పర్పస్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇది త్రీవీలర్‌గానూ, ఎలక్ట్రిక్ స్కూటర్‌గానూ పని చేస్తుంది. ఈ స్కూటర్‌ని కొన్ని నిమిషాల్లో త్రీ వీలర్‌కి అటాచ్ చేసి వేరు చేయవచ్చు.
స్కూటర్ త్రీ-వీలర్ లోపల ఉంటుంది.
ఈ వాహనం SURGE S32 సిరీస్. వాస్తవానికి, ఈ కార్గో త్రీవీలర్ లోపల ద్విచక్ర వాహనం లేదా స్కూటర్ ఉంటుంది. మొదట్లో ఇది మూడు చక్రాల వాహనం, ఇది ముందు సీటులో ఇద్దరు వ్యక్తులు కూర్చునేందుకు స్థలం ఉంటుంది, కానీ స్కూటర్ బయటకు వచ్చినప్పుడు. అప్పుడు సీటింగ్ కెపాసిటీ స్కూటర్ సీటుకు మారుతుంది.
ఈ వీడియోలో దీనిని చూడవచ్చు:
కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, మూడు-చక్రాల నుండి ద్విచక్ర వాహనంగా మార్చడానికి 3 నిమిషాలు టైమ్ మాత్రమే పడుతుంది. S32 PV, S32 LD, S32 HD, S32 FB అనే మొత్తం 4 వేరియంట్‌లను కంపెనీ దీనిని విడుదల చేస్తుంది. S32 LDని హీరో వరల్డ్ 2024లో ప్రదర్శించారు.
Also Read: స్క్రిప్ట్ ఇస్తే చాలు.. వీడియో రెడీ.. AIతో గూగుల్ సంచలనం
సర్జ్ S32(Hero Surge) త్రి-వీలర్ - టూ-వీలర్ కోసం వేర్వేరు పెరామీటర్స్ తో ఉంటుంది. S32 LD మూడు చక్రాల వాహనం అయినప్పుడు, అది 10 Kw శక్తిని పొందుతుంది. దీని కోసం ఇది 11 Kwh బ్యాటరీకి కనెక్ట్ చేయబడింది. దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు. ద్విచక్ర వాహన పెరామీటర్స్ పరంగా, ఇది 3 Kw శక్తిని పొందుతుంది. దీని కోసం ఇది 3.5 Kwh బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు.
త్వరలోనే ఇది మార్కెట్లోకి రావచ్చు. మార్కెట్లోకి వచ్చేసమయంలో దీని ధరను ప్రకటించే అవకాశం ఉంది.
Watch This Interesting Video :