/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-54-jpg.webp)
EAGLE Trailer: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఈగల్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ. జీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ సినిమాను జనవరి 13 న పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యాక్షన్ త్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన కావ్య పథార్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందాయి.
Also Read: Net Flix: 2023 లో నెట్ ఫ్లిక్స్ వేదిక పై అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాలు ఇవే..!
తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. ట్రైలర్ లోని విజువల్స్ ప్రేక్షకులలో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ఆసక్తిని పెంచేలా ఉంది. "మార్గశిరం.. మధ్యరాత్రి.. ఓ మొండి మోతుబరి" అనే పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ సాగింది. ట్రైలర్ లో రవితేజ, నవదీప్, అనుపమ, శ్రీనివాస్ అవసరాల విజువల్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. రవితేజ మాస్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా సినిమా నుంచి విడుదలైన 'ఆడు మచ్చా' సాంగ్ సోషల్ మీడియాలో మిలియన్ కు పైగా వ్యూస్ సాధించింది.
Also Read: Aadu Macha Song: ‘ఆడు మచ్చా’.. మాస్ మహారాజ్ ‘ఈగల్’ ఫస్ట్ సాంగ్..!