Aadu Macha Song: 'ఆడు మచ్చా'.. మాస్ మహారాజ్ 'ఈగల్' ఫస్ట్ సాంగ్..! రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈగల్. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ 'ఆడు మచ్చా' రిలీజ్ చేశారు. ఈ పాటకు దావ్ జాంద్ సంగీతం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ సాంగ్ లో రవితేజ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. By Archana 06 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Aadu Macha Song: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ త్రిల్లర్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మేకర్స్ 2024 జనవరి 13 న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్.. సినిమా ఎప్పుడంటే..! అయితే తాజాగా ఈగల్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ 'ఆడు మచ్చా' విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దావ్ జాంద్ మంచి మాస్ బీట్స్ తో ఈ పాటకు సంగీతం అందించారు. “తురుపు తునక.. ఎరుపు బారెనే.. ఎగులు దునికి దుంకులాడెనే” అంటూ ఈ సాంగ్ మొదలైంది. ఈ పాటలో రవితేజ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. మాస్ స్టెప్పులతో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రవితేజ ఎనర్జీ కి దీటుగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్ రాశారు. డిసెంబర్ 5 న విడుదలైన సాంగ్ ఒక్క రోజులోనే 1 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, కావ్య పథార్, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read: Trisha : ‘యానిమల్’ పై త్రిష పోస్ట్.. నెట్టింట్లో వైరల్ ..! #eagle-movie-first-song #ravi-teja-eagle-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి