Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ది రానా కనెక్షన్‌' అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరించబోతున్నారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది అమెజాన్ ప్రైమ్.

Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..!
New Update

Rana Daggubati Talk Show: టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు పొందారు. భాషతో సంబంధం లేకుండా ప్రధాన పాత్రల నుంచి సహాయ నటుడి పాత్రల వరకు విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుత రానా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హిరణ్య కశ్యప సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Also Read: RGV Movie: ‘నా పెళ్ళాం దెయ్యం’.. వైరలవుతున్న ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్

సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి

ఇది ఇలా ఉంటే.. రానా మరో సరి కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ప్రసారం కానున్న 'ది రానా కనెక్షన్‌' (The Rana Connection) అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. రానా ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియా సమర్పణలో ఈ షోను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ టాక్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం ఇంకా రివీల్ చేయలేదు . త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

Rana Daggubati Talk Show The Rana Connection

గతంలో రానా నెంబర్ 1 యారీ పేరుతో సెలెబ్రెటీ టాక్ షో హోస్ట్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా వేదికగా ప్రసారమైన ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రాబోతున్న 'ది రానా కనెక్షన్‌' షోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Rana Daggubati Talk Show The Rana Connection

Also Read:   RRR మూవీలో అసలు ట్విస్ట్ అదే.. కానీ స్టోరీ మొత్తం మార్చేశాము..! రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

#rana-daggubati #amazon-prime #rana-daggubati-latest-talk-show #the-rana-connection
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe