Kalki 2898 AD: సలార్ సినిమాతో వసూళ్ల సునామీ సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో బిజీగా ఉన్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన కల్కి టీజర్, పోస్టర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను.. చివరికి మే 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: Goud Saab: హీరోగా ప్రభాస్ తమ్ముడు ఎంట్రీ.. ‘గౌడ్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్
కల్కి రిలీజ్ మరో సారి వాయిదా
అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని మరో సారి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ 17 అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, మూవీ సీజీ వర్క్స్ కూడా ఇంకా పూర్తి కాలేదని.. అందుకే సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు టాక్. అలాగే తెలంగాణ, ఏపీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ ప్రభావం సినిమా పై పడకూడదని చిత్రబృందం భావించినట్లు సమాచారం.
ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో స్టార్ కాస్ట్ అమితాబ్, కమల్ హసన్, దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న కల్కి.. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా పటాని మధ్య జరిగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
Also Read: Goud Saab: హీరోగా ప్రభాస్ తమ్ముడు ఎంట్రీ.. ‘గౌడ్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్