Jr NTR: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతమయ్యాయి. భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం పెరిగి ఏపీ(AP), తెలంగాణలోని(Telangana) పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం, ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు తమ నివాసాలు కోల్పోయి తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
విపత్తు బాధితులకు ఎన్టీఆర్ సహాయం
ఈ నేపథ్యంలో విపత్తు బాధితులకు అండగా తన వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు హీరో ఎన్టీఆర్. వరద భీభత్సంతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాల బాధితులకు తన వంతుగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఎన్టీఆర్ ఎక్స్ పోస్ట్
"రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన వరద బీభత్సము తనను ఎంతగానో కలచివేసిందని. ఈ విపత్తు నుంచి ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడేందుకు తన వంతుగా.. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి విరాళం ప్రకటిస్తున్నాని తెలిపారు. ఏపీ, తెలంగాణ చెరొక 50 లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు."
Also Read: Devara Third Single: జాన్వీ- తారక్ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చేసింది..? - Rtvlive.com