Hero Nikhil: ఆ థియేటర్ లో 'సలార్' సినిమాకు 100 టికెట్స్ ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'సలార్'. డిసెంబర్ 22 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ప్రభాస్ వీరాభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. శ్రీరాముల థియేటర్ లో 'సలార్' మిడ్ నైట్ షోకు 100 టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపారు.

New Update
Hero Nikhil: ఆ థియేటర్ లో 'సలార్' సినిమాకు 100 టికెట్స్ ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్..!

Hero Nikhil: స్టార్ హీరోల సినిమా విడుదల అనగానే.. ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉంటారు. అందులో ప్రభాస్ సినిమా అంటే.. ఇంక ఫ్యాన్స్ కు పూనకాలే. రిలీజ్ కు వారం రోజుల ముందే నుంచే టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తారు. ఎలాగైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనుకునే వీరాభిమానులు కూడా ఉంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా డిసెంబర్ 22 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా టికెట్స్ కు సంబంధించి ప్రభాస్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశారు టాలీవుడ్ యువ హీరో నిఖిల్.

publive-image

వేదికపైనే పెళ్లి కూతురిని రేప్ చేసిన విలన్.. ఆ సమయంలో తప్పలేదంటూ - Rtvlive.com

విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'సలార్'. చాలా రోజుల పాటు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ నెల 22 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే పలు చోట్ల టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. డైరెక్టర్ రాజమౌళి 'సలార్' మొదటి టికెట్ కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా హీరో నిఖిల్ డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ కోసం 100 టికెట్స్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. డిసెంబర్ 21 న హైదరాబాద్ లోని శ్రీరాముల థియేటర్ లో సలార్ మిడ్ నైట్ షో పడనుంది. ఈ షోకు 100 మంది ప్రభాస్ వీరాభిమానులకు ఫ్రీ టికెట్స్ ఇస్తానని.. ఫ్యాన్స్ కలిసి తాను కూడా సినిమా చూస్తానని చెప్పారు.

Salaar Song: ఇదికదా.. ఫ్యాన్స్ కి కావలసింది.. ఒక్క సాంగ్ తో సలార్ ఎమోషనల్ దుమ్మురేపాడు - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు