/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-5-7.jpg)
Saripodhaa Sanivaaram - Garam Garam Song Lyrics: టాలీవుడ్ స్టార్ హీరో నాని (Hero Nani) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ ముద్దు గుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అంటే సుందరానికి ‘ లాంటి సూపర్ హిట్ తర్వాత వివేక్, నాని కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా .. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
సరిపోదా శనివారం ఫస్ట్ సింగల్ 'గరం గరం'
తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'గరం గరం యముడయో .. సహనాల శివుడాయో.. ' అంటూ పవర్ ఫుల్ మాస్ లిరిక్స్ తో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగా కొనసాగుతోంది ఈ పాట. భారీ ఉహాగానాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ ఎస్. జే సూర్య, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. వైరలవుతున్న అప్డేట్..!