Dhanush: తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ వివాదం

తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ లో వివాదం తలెత్తింది. అలిపిరి వద్ద మర్డర్ సీన్ చిత్రీకరించే క్రమంలో తిరుమలలో పెళ్లి వాహనాలను బౌన్సర్లు దారి మళ్లించారు. భక్తులకు ఇబ్బంది కలగడంతో షూటింగ్ చేయోద్దని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా సినిమా యూనిట్ షూటింగ్‌ ఆపేసింది.

New Update
Dhanush: తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ వివాదం

Hero Dhanush: తిరుపతిలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో వివాదం తలెత్తింది. అలిపిరి గరుడ సర్కిల్, కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయ గోపురం వద్ద పలు సన్నివేశాలను షూటింగ్‌ చేసేందుకు ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు అనుమతి తీసుకున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పర్మిషన్‌ తీసుకున్నారు.

Also Read: ఓటీటీలో హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లకు బ్యాడ్ న్యూస్…స్ట్రీమింగ్ ఇప్పుడే లేదట..!!

ఈ క్రమంలోనే అలిపిరి వద్ద మర్డర్ సీన్ చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం. అయితే, అదే సమయంలో అటు వైపు వెళ్తోన్న భక్తులను బౌన్సర్లు ఆపేసినట్లు తెలుస్తోంది. తిరుమలలో పెళ్లి వాహనాలను కూడా అడ్డుకున్నారని.. వేరే దారి మళ్లిస్తూ భక్తులకు అంతరాయం కలిగించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌..మెడలో మంగళసూత్రమే సాక్ష్యం!

దీంతో, షూటింగ్ చేయోద్దని స్థానికులతో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇక చేసేదేమీ లేక తాత్కాలికంగా సినిమా యూనిట్ షూటింగ్‌ ఆపేసింది.

Advertisment
తాజా కథనాలు