/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-25T175653.114.jpg)
Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం రాయన్. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం జులై 16న తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ .
ఎస్‌జే సూర్య, హీరో ధనుష్ పోస్టర్
రాయన్ మూవీలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా 'గెట్ రెడీ ఫర్ ఎపిక్ ఫేస్ ఆఫ్' అంటూ హీరో ధనుష్, ఎస్‌జే సూర్య పోస్టర్ ను షేర్ చేశారు. పోరుకు సిద్ధంగా ఉండండి అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ కథానాయికలుగా నటించగా.. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Get ready to witness this epic face-off 🔥#Raayan in cinemas from July 26 🙌🏼@dhanushkraja@arrahman@iam_SJSuryah@selvaraghavan@kalidas700@sundeepkishan@prakashraaj@officialdushara@Aparnabala2@varusarath5#Saravanan@omdop@editor_prasanna@PeterHeinOffl@jacki_art… pic.twitter.com/xHNWuSJpmJ
— Sun Pictures (@sunpictures) June 25, 2024