/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T181121.920-jpg.webp)
Ajith : కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో అజిత్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. విడా ముయార్చి అనే సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఈ వీడియోలో అజిత్ కారులో రిస్కీ స్టంట్ చేశారు. అయితే అనూహ్యంగా కారు బోల్తా కొట్టడంతో అజిత్‌కి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇది 2023 నవంబర్‌లో జరిగినట్లు సమాచారం. అజిత్ మేనేజర్ తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవుతుంది.
Bravery knows no bounds! 💪 Witness Ajith Kumar's fearless dedication as he takes on a daring stunt sequence in #VidaaMuyarchi without any stunt double. 🫡 🔥#AjithKumar pic.twitter.com/62NyEG4cvG
— Lyca Productions (@LycaProductions) April 4, 2024
హ్యాట్సాఫ్ తలా
ప్రస్తుతం దర్శకుడు మాగిజ్ తిరుమనేనితో 'విడా ముయార్చి'(Vidaa Muyarchi) అనే చిత్రంలో నటిస్తున్నారు అజిత్. ఈ షూటింగ్ సమయంలో చేసిన ఓ రిస్కీ స్టంట్‌కి సంబంధించిన వీడియోను తాజాగా అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన షూటింగ్ వీడియో ఇది. ఇందులో అజిత్ కార్ నడుపుతూ ఓ ఇంటెన్స్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రోడ్డుపైన ఆ కారు అదుపు తప్పి పడిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే కారు దగ్గరకి వెళ్లి అజిత్ సహా మరో నటుడిని బయటకి తీసే ప్రయత్నం చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఈ సంఘటన జరిగినట్లు అజిత్ మేనేజర్ తెలిపారు. అయితే ఈ వీడియో చూసిన తలా ఫ్యాన్స్(Tala Fans) తెగ టెన్షన్ పడుతున్నారు. అజిత్ చాలా రిస్క్ తీసుకుంటారని తెలిసిందే కానీ ఈ వీడియో మాత్రం మరో రేంజ్‌లో ఉండటంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అజిత్‌ను రిస్క్ తీసుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అజిత్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
గతంలో అజిత్ బైక్స్‌తో ఎంతో రిస్కీ సీన్స్‌ను చేశారు. ప్రొఫిషనల్‌గా రేసర్ కావడంతో అజిత్‌కి ఇది చాలా ఈజీ. కానీ చూసేవాళ్లకి మాత్రం ఆ స్పీడ్‌కి కళ్లు చెదిరిపోతుంటాయి. ఇటీవల అజిత్ చేసిన భారీ యాక్షన్ చిత్రం 'వలిమై'లో కూడా ఓ క్రేజీ బైక్ సీక్వెన్స్ చేస్తూ అజిత్ పడిపోయారు.
Also Read : మళ్లీ దొరికిపోయిన విజయ్-రష్మిక.. ఇదిగో ప్రూఫ్!