Telangana State New Emblem : సీఎం రేవంత్ మార్క్.. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఇదే! తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం రూపకల్పన తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త రాష్ట్ర చిహ్నం అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరుల ప్రతీకగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగా రూపొందించిన లోగోలో పొందుపరిచారు. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. By V.J Reddy 30 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి New Emblem : తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం (Telangana State New Emblem) రూపకల్పన తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ కొత్త రాష్ట్ర చిహ్నం ఫోటో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. అమరవీరుల ప్రతీకగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగా రూపొందించిన లోగోలో పెట్టారు. కొత్త లోగో (Logo) లో అమరవీరుల స్తూపంతో పాటు వరి కంకులు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌తో పాటు కొత్తగా హిందీ భాషలో తెలంగాణ ప్రభుత్వం రాసిన పదాలు కొత్త లోగోలో పొందుపరిచారు. పాత లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉండేవి. Telangana state new logo: Unofficial pic.twitter.com/RxKW7bUB5L — Vijay Reddy (@vijay_reports) May 30, 2024 Also Read : నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి కాగా కొత్త లోగోలో చార్మినార్‌తో పాటు కళాతోరణం తొలిగించారు. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ (CM Revanth) కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. #social-media #logo #telangana-state-new-emblem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి