Summer Tips : వేసవిలో మీ కళ్లను కాపాడుకోండిలా..!

మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ టిప్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Summer Tips  : వేసవిలో మీ కళ్లను కాపాడుకోండిలా..!
New Update

Summer Tips : వేసవి కాలం వచ్చిందంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు స్వాగతం పలికినట్లే. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలతో బయటపడవచ్చు. ఎక్కువగా వినియోగించే నిమ్మకాయ, వేసవిలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సహాయపడుతుంది. ఈ పానీయాన్ని ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ ఔత్సాహికులు కూడా తీసుకోమని చెబుతున్నారు. వేసవిలో చేసే నిమ్మకాయ షర్బత్ ది ప్రత్యేక స్థానం. నిమ్మరసం, నీళ్లు, నల్ల ఉప్పు, చక్కెర ఇతర స్వీటెనర్లతో తయారు చేసిన ఈ డ్రింక్ మీరు హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో ఇది మీ కళ్లను కాపాడుతుంది.

వేడి, సూర్య కిరణాలకు గురికావడం వల్ల కంటిశుక్లం, మాక్కులర్ డీజెనరేషన్, కళ్లు పొడబారడం వంటి ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. కొంతమందికి ఈ సీజన్ లో నిరంతరం కంటి చికాకు ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా గాలిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల మన కళ్లు అలర్జీకి గురవుతుంటాయి. అందుకే వేసవిలో మీ కళ్లను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మంచిక్వాలిటీ సన్ గ్లాసెస్ , కంటి చుక్కలు సూర్యకిరణాల నుంచి కాపాడుతాయి. అయితే మీ సమస్యలకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాలతో మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే లేమన్ వాటర్ గొప్పగా పనిచేస్తుంది.

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పోషకాహార యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్ నష్టం, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్లన రక్షించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ ఎ కూడా ఉంటుంది.చూపును మెరుగుపరచడంలో సహాయపడే ముఖ్యమైన పోషకం. నిపుణుల అభిప్రాయంప్రకారం శరీరంలో విటమిన్ ఎ లేకపోవడం పాక్షిక అంధత్వానికి దారితీస్తుంది.ఇందులోని విటమిన్ సి కళ్లలోని రక్తనాళాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇదిరెటీనాకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. కంటిచూపును మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: మసీద్‌పై బాణం ఎక్కుపెట్టిన వీడియో.. క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత

#eye-health #summer #summer-tips #summer-health-care #tips-and-tricks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe