Kiwi Health Benefits: కివీ పండు పొట్టు సులభంగా వలిచే చిట్కాలు..మీరూ ట్రై చేయండి అందరికి అందుబాటులో ఉండే పండ్లలో కివీ పండు ఒకటి. ఇది పుల్లగా, ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. కివీ పండును పైన కొంత భాగం కట్ చేసి చిన్న గాటులా పెట్టాలి. తర్వాత లోపల స్పూన్ పెట్టి చుట్టూ పొట్టు కింద తిప్పుతూ ఐస్ క్రీమ్ తీసినట్లు తీయాలి. అప్పుడు కివీ పండు పొట్టు ఈజీగా వస్తుంది. By Vijaya Nimma 12 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Kiwi Health Benefits: అందరికి అందుబాటులో ఉండే పండ్లలో కివీ పండు ఒకటి. ఇది పుల్లగా, ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. పైనంతా పొట్టును కలిగి ఉండటం వల్ల దీన్ని తినేందుకు కొందమంది ఇష్టపడరు. కానీ.. కివీ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక.. దీన్ని తింటే ఎలాంటి వ్యాధులున్న వెంటనే దూరం అవుతాయి. కివీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా.. డెంగ్యూ వంటి విష జ్వరాలను ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఈ పండ్లను తింటే ప్లేట్‌లెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఇది కూడా చదవండి: మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి! కివీ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇంకా కివీ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. అయితే.. కివీ పండ్లను పొట్టుతో కూడా తినవచ్చు. కానీ.. కొందరికి పొట్టు తినడం ఇష్ట పడరు. వారు దాన్ని తీసేసి తింటారు. అయితే.. ఈ కివీ పండు పొట్టును సులభంగా తీయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కివీ పండు పొట్టు తీయటానికి టిప్స్ ముందు కివీ పండును పైన కొంత భాగం కట్ చేయాలి. తరువాత మీద చిన్న గాటులా పెట్టిన అనంతరం లోపల స్పూన్ పెట్టి చుట్టూ పొట్టు కింద తిప్పుతూ ఐస్ క్రీమ్ తీసినట్లు తీయాలి. దీంతో కివీ పండు పొట్టు ఈజీగా వస్తుంది. ఇలా కివీ పండును పొట్టు తీసి తినవచ్చు. పండ్లు తింటున్నప్పుడు, కోసేటప్పుడు, పొట్టు తొలగించి పండును తినటం కష్టంగా ఉంటుంది. కివీ పండ్లలో ఎన్నో అద్భుతమైన లాభాలున్నాయి. వీటిని మధ్యాహ్నం లంచ్ తరువాత తింటే శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఈరోజుల్లో కొన్ని కల్తీ, రసాయనాల వల్ల పండ్లను తొక్కలు తీసేసి తింటారు. కివీని కూడా పొట్టు తినలేక ఇబ్బంది పడకుంట పొట్టు తీసి తినాలి. కొన్ని చలికాలంలో కివీ పండు తింటే మంచి ప్రయోజనాలున్నాయి. కివీ పండు ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి రోజువారీ ఆహారంలో చేర్చవచ్చు. కివీ పండులో ఉండే ఫైబర్ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది. అదేవిధంగా, ఇది రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, బరువు తగ్గడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #kiwi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి