Hemanth Soren Arrest: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌..నెక్స్ట్‌ సీఎం?

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అయితే సోరెన్ అరెస్ట్ కావాడానికి కొద్ది సేపటి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికారులు రాంచీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Hemanth Soren Arrest: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌..నెక్స్ట్‌ సీఎం?
New Update

Arrest: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ (Hemanth Soren) ను ఈడీ (ED) బుధవారం సాయంత్రం అరెస్ట్‌(Arrest)  చేసింది. ఆయన తన పదవీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. చాలా సేపు విచారణ తరువాత ఈడీ అధికారులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. హేమంత్‌ అరెస్ట్ తో జార్ఖండ్‌ రాజధాని రాంచీలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

సుమారు 7 వేల మంది పోలీసు సిబ్బంది రాంచీలో మోహరించారు. అయితే హేమంత్‌ అరెస్ట్‌ కావడానికి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. హేమంత్‌ స్వయంగా రాజ్‌భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ ఊహించని సంఘటన నేపథ్యంలో జార్ఖండ్‌ అధికార కూటమిలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చాతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజ్‌ భవన్‌ వద్దకు వచ్చారు.

ఈ క్రమంలో తరువాత ముఖ్యమంత్రిగా మంత్రి చంపై సోరెన్‌ (Champai soren) పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. శాసనసభాపక్ష నేతగా ఆయన్ని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆయన గవర్నర్‌ ను కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓ పక్క హేమంత్‌ రాజీనామా..అరెస్ట్‌ తో జేఎమ్‌ఎమ్‌ అధినేత శిబు సోరెన్‌ ఇంట్లో నే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైనట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే హేమంత్‌ ముందుగానే తన అరెస్ట్ గురించి ప్రస్తావిస్తూ తాను అరెస్ట్‌ అయితే తన భార్య కల్పనా సోరెన్‌ (Kalpana Soren)ను ముఖ్యమంత్రి చేయాలని తెలిపారు. అయితే ఆ నిర్ణయాన్ని హేమంత్‌ అన్న భార్య అయినటువంటి సీతా సోరెన్‌ ఒప్పుకోలేదు. ఆమె కల్పనా సీఎం కావడానికి తాను వ్యతిరేకం అంటూ బహిరంగంగానే ప్రకటించారు.

దీంతో ముఖ్యమంత్రి పీఠం కోసం శిబు సోరెన్‌ (Sibu Soren)ఇంట్లో పోరు మొదలైనట్లు సీతా సోరెన్‌(Seetha Soren) చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది. సీతా సోరెన్‌ చేసిన వ్యాఖ్యల వల్ల జార్ఖండ్‌ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అసలు రాజకీయాలు తెలియని..ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని కల్పన సోరెన్‌ ను ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారంటూ సీతా సోరెన్‌ ప్రశ్నించారు.

ఒక వేళ శిబు కుటుంబం నుంచే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటూ ఉంటే కనుక నేను 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది అంటూ ఆమె తెర మీదకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కల్పనా సోరెన్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తుంది.

అయితే అరెస్ట్‌ అయిన కొద్ది సేపటికే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి సోరెన్‌ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.

"ఇది విరామం"
జీవితం ఒక గొప్ప యుద్ధం
నేను ప్రతి క్షణం పోరాడాను, ప్రతి క్షణం పోరాడతాను
కానీ నేను రాజీ కోసం వేడుకోను

ఓటమిలో ఏది, విజయంలో ఏది
నేను అస్సలు భయపడను
చిన్నతనం ఇప్పుడు నన్ను తాకవద్దు
మీరు గొప్పవారు, కొనసాగించండి

మన ప్రజల హృదయాల బాధ
నేను వృధాగా వదులుకోను
ఓటమిని అంగీకరించను...

జై జార్ఖండ్!

అంటూ పేర్కొన్నారు.

Also read: ధనియాలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కు చెక్‌ పెట్టేద్దామా!

#arrest #ed #hemanth-soren #champai-soren #jarkhand #ranchi #kalpana-soren #seetha-soren
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe