Yediyurappa : ఆమెకు డబ్బులు కూడా ఇచ్చాం.. లైంగిక వేధిపుల కేసుపై యడియూరప్ప ఏం అన్నారంటే?

మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన యడియూరప్ప ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తే వారు మాత్రం ఇలా కంప్లైంట్ చేశారన్నారు.

Yediyurappa : ఆమెకు డబ్బులు కూడా ఇచ్చాం.. లైంగిక వేధిపుల కేసుపై యడియూరప్ప ఏం అన్నారంటే?
New Update

Karnataka Ex. CM Yediyurappa : 17 ఏళ్ల మైనర్‌ తల్లి(Minor Girl) చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(BS Yediyurappa) స్పందించారు. ఒకటిన్నర నెలల క్రితం ఓ తల్లీ, కూతురు సాయం కోరుతూ తనని సంప్రదించారన్నారు. అయితే ముందుగా తాము వారిని పట్టించుకోలేదని... అయితే ఆ సమయంలో మైనర్‌ బాలిక ఏడుస్తున్నట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు. వారి బాధను గమనించి.. వారితో మాట్లాడి సమస్యలను చర్చించడానికి ఆఫీస్‌లోకి ఆహ్వానించామన్నారు యుడియూరప్ప. తల్లి, కూతురి సమస్యను పరిష్కరించాలని పోలీసు కమీషనర్‌కు సూచించామన్నారు. వారికి ఆర్థికంగా కూడా సాయం చేవామని.. అయితే ఆ ఇద్దరు మాత్రం ఇలా కంప్లైంట్‌ ఇచ్చారన్నారు.


అసలేం జరిగింది?
లైంగిక వేధింపుల(Sexual Assault) ఘటన ఫిబ్రవరి 2న జరిగినట్టగా బాధితురాల తల్లి ఆరోపిస్తున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన మరొక కేసులో సహాయం కోరేందుకు తల్లి, ఫిర్యాదుదారు (17 ఏళ్ల బాలిక) యడియూరప్ప వద్దకు వెళ్లినప్పుడు ఇలా జరిగినట్టు సమాచారం. ఈ కేసులో దోషిగా తేలితే పోక్సో చట్టం 2012 ప్రకారం కనీస శిక్ష 3 సంవత్సరాలు. సెక్షన్ 4 ప్రకారం, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు కోర్టు నిర్ణయించిన కనీస శిక్ష 20 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా. అయితే ఇక్కడ బాలిక వయసు 17ఏళ్లుగా తెలుస్తోంది.

కొట్టిపారేసిన యడియూరప్ప ఆఫీస్:
యడియూరప్ప కార్యాలయం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఫిర్యాదుదారు గతంలో దాఖలు చేసిన కేసుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు ఆమె 51 వేర్వేరు ఫిర్యాదులు చేసినట్టుగా యడియూరప్ప కార్యాలయం చెబుతోంది. వారికి ఫిర్యాదులు చేసే అలవాటు ఉందని చెబుతూ యడియూరప్ప కార్యాలయం ఈ ఆరోపనలను తోసిపుచ్చింది. యడియూరప్ప 2007లో ఏడు రోజులు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2008 నుంచి 2011 వరకు, మే 2018లో మూడు రోజులు, ఆపై జూలై 2019 నుంచి జూలై 2021 వరకు కర్ణాటకలో సీఎం పదవిలో ఉన్నారు.

Also Read : రూ. 1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌ కింగ్‌ మార్టిన్ శాంటియాగో ఎవరు? ఆయన ED స్కానర్‌లో ఎందుకు ఉన్నాడు?

#karnataka #minor-girl #yediyurappa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe