Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఉన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా (Odisha) తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రుతుపవన ద్రోణి బుధవారం , మాండ్ల, రాయిపూర్, జైసల్మర్, అజ్మీర్‌తో పాటు ఒడిశా తీరం వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం గుండా వెళుతూ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని అధికారులు వివరించారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గురువారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.