Rains: మరో మూడు రోజులు దేశంలో పలు రాష్ట్రాల్లో వానలు: ఐఎండీ!

దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Rains: మరో మూడు రోజులు దేశంలో పలు రాష్ట్రాల్లో వానలు: ఐఎండీ!
New Update

దేశంలో గత కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు పడుతున్నాయి. ఇటు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్ 14 వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. సెప్టెంబర్ 12 నుంచి ఒడిశా, ఛత్తీస్‌ ఘడ్‌ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి ఉత్తర ప్రదేశ్‌ లో కురిసిన వర్షమే భారీ వర్షమని అధికారులు పేర్కొన్నారు.

12 గంటల్లో అత్యధికంగా 90 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఆగకుండా వర్షం పడుతుండడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే మంగళవారం వరకు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లక్నోలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెప్టెంబర్ 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

#alert #heavy-rains #imd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe