Heavy Rains: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.జమ్మూ, కశ్మీర్‌,హర్యానా, చండీగడ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

New Update
Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు

IMD: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొంది. జమ్మూ, కశ్మీర్‌ , పశ్చిమ రాజస్థాన్‌, హిమచల్‌ ప్రదేశ్‌, హర్యానా, చండీగడ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, సిక్కిం, జార్ఖండ్‌, ఒడిశా, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర, అరుణాల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, గోవా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Also read: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు