AP Rains: 3 గంటల నుంచి స్థిరంగా వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా ఉంది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ పేర్కొంది.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!
New Update

AP Rains: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా ఉంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది నెమ్మదిగా వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వివరించారు. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Also read: తెలంగాణ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పు!

#rains #lowpressure
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe