Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు !

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Heavy Rains In Telangana : తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖాధికారులు పేర్కొన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌ నగర్‌ , మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, కరీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, సిద్దిపేట‌, సంగారెడ్డి, మెద‌క్, జిల్లాల్లో నేడు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఉరుములు, మెరుపుల‌తో పాటు భారీ ఈదురుగాలులు (Heavy Storms) వీచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. గంట‌కు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉందని అధికారులు వివరించారు.

Also read: తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Advertisment
తాజా కథనాలు