Heavy Rain Alert: తెలంగాణలో గత నాలుగురోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు..మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండగా మారి ప్రవాహిస్తున్నాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది..
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, హనుమకొండ, ములుగు,కామారెడ్డి, ఆసిఫాబాద్,మంచిర్యాల,సంగారెడ్డి, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్!
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు.
భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని..జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కిందకు వెళ్లరాదని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ బడ్జెట్.. వ్యయం అంచనా ఎంతంటే