తెలంగాణలోని పలు జిల్లాలలో నిన్న(మంగళవారం) సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో మరో మూడు, నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతాయని పేర్కొంది. వాతావరణ మార్పులతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
అకాల వర్షాలు.. దెబ్బ తిన్న పంటలు:
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి పడిన వర్షానికి కొన్ని జిల్లాల్లో రైతులు పంట నష్టపోయారు. ఈ అకాల వర్షాలు రైతన్నలను కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని తెలంగాణ వ్యాప్తంగా 30 శాతం మంది రైతులు వరి పంటను కోసి కల్లాల్లో అమ్మకానికి పెట్టగా.. మరో 70 శాతం మంది రైతుల ఇంకా వరి పంటను కొయ్యనేలేదు. తెలంగాణ ప్రభుత్వం కొనుగోళ్ల సెంటర్లను ఇంకా అన్నీ ప్రాంతాల్లో ప్రారంభించలేదు. దీంతో కొనుగోళ్ల సెంటర్లలో ఉంచిన వరి ధాన్యం వర్షాలకు తడిసి ముద్దయింది. కొన్ని చోట్లల్లో వర్షాల ధాటికి చేనులు నీట మునిగాయి. పత్తి పంట కూడా దెబ్బతింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉండడంతో వెంటనే కొనుగోళ్ల సెంటర్లను ప్రారంభించి పంట సేకరణ మొదలు పెట్టాలని రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!
రాజకీయా నాయకులకు షాక్ ఇస్తున్న వర్షాలు:
తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వరుస ప్రచారాలతో దూసుకుపోతున్న రాజకీయ నేతలకు వర్షాలు ఝలక్ ఇస్తున్నాయి. ప్రచారాల్లో భాగంగా నేతలు సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వర్షాల కారణంగా జనాలు సభలకు రావడం లేదట. దీంతో నాయకులు ఏమీ చేయాలో తేలిక తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి వర్షాలు రాజకీయా నాయకులను కరుణిస్తాయా? లేదా? అనేది చూడాలి.