Heavy Rains Lashes In Hyderabad : హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కుండపోతకు నగరంలోని పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే రాంనగర్ లో ఓ కారు వరదనీటిలో చిక్కుకుంది. భారీ వర్షానికి (Heavy Rain) కారు నీటిలో మునిగిపోయింది. కారు డోర్లు ఓపెన్ కాకపోవడంతో అందులో నలుగురు ప్రయాణికులు చిక్కుకుపోయారు.
స్థానికులు వారి ప్రాణాలకు తెగించి కారులో ఉన్న వారిని కాపాడారు. కారు అద్దాలు పగలగొట్టి కారులోంచి లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. రాంనగర్ స్ట్రీట్ నెంబర్ 17లో ఈ ఘోర ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీగా వరద రావడంతో కారు కొట్టుకుపోయింది. భారీ వర్షం నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తింది.
ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉద్దృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కారు లోపలే ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. స్థానిక యువకుడు ప్రణీత్ యాదవ్ అతడి స్నేహితులు రిస్క్ చేసి కారును గోడ పక్కకు తీసుకొచ్చారు. అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది.
Also read: ఘోర రోడ్డు ప్రమాదం…డీసీఎం ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం!