Andhra Pradesh : ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర... పొంగిన వాగులు... నిలిచిన రాకపోకలు!

ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

AP: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ఆ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..!
New Update

North Coastal District : వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఉమ్మడి విజయనగరంతో పాటు శ్రీకాకుళం (Srikakulam) లో వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.

విజయనగరం జిల్లా (Vizianagaram District) రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు నీట మునిగాయి.శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడత వలస వచ్చే రహదారి మధ్యలోని సెట్టిగెడ్డలో సరకుల వాహనం ఒకటి కొట్టుకుపోయింది. వాహనం బయటకు రాకపోయినప్పటికీ డ్రైవర్‌ ని స్థానికులు రక్షించారు.

Also Read: బుడమేరుకు ఏ క్షణమైనా వరద!

#heavy-rains #srikakulam #vizianagaram #north-coastal-districts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe