Tripura : వర్ష బీభత్సం.. 22 మంది మృతి!

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల త్రిపురలో సుమారు 22 మంది మృతి చెందారు. మరో 10 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు.

AP: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ఆ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..!
New Update

Heavy Rains In Tripura : గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) కారణంగా త్రిపుర (Tripura) లో 22 మంది మృతి చెందారు, మరో పది మంది వరకు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతినడంతో రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు. శాంతిర్‌బజార్‌లోని అశ్వని త్రిపుర పారా, దేబీపూర్‌లలో కొండచరియలు (Landslides) విరిగిపడటంతో పది మంది శిథిలాల కింద సమాధి అయ్యారని ముఖ్యమంత్రి మాణిక్ సాహా సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ ద్వారా తెలియజేశారు.

అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ సీఎం రాసుకొచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతకుముందు రెవెన్యూ శాఖ కార్యదర్శి బ్రిజేష్ పాండే మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలకు 22 మంది మరణించారని ప్రకటించారు. ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, పది మంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

Also Read: 156 ఔషధాలపై కేంద్రం నిషేధం…వాటిలో ఈ మందులు కూడా..!

#social-media #heavy-rains #tripura
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe