Rain Alert For AP-TG : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ (Telangana) లోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పియర్‌లో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏపీలోని లోయర్ ట్రోపో జోన్, యానాంలో నైరుతి గాలులు వీస్తున్నట్లు అధికారులు వివరించారు. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. ఉరుములతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
Also Read: వణికిస్తున్న విష జ్వరాలు!