Khammam: అధైర్య పడకండి.. అండగా ఉంటాం: వరద బాధితులకు రేవంత్ భరోసా

భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తామన్నారు. భాదితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Khammam: అధైర్య పడకండి.. అండగా ఉంటాం: వరద బాధితులకు రేవంత్ భరోసా
New Update

Khamam: భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మున్నేరు వరద కుటుంబాల్లో విషాదాన్ని నింపిందన్నారు. ఇప్పటికే మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం రూ. 650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామని చెప్పారు. వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారని, వరదలో నష్ణపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తామన్నారు. నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందిస్తామని, భాదితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

Also Read : ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన.. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ!

#cm-revanth #khammam #polepally
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe