Kerala Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 8మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 48గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

New Update
Kerala Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

Kerala Rains: కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొల్లాంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి.. నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి పెరియార్‌ రివర్‌ ప్రవహిస్తోంది. పెరియార్‌ నది వరద ఉధృతికి అళువాలోని మనప్పురం శ్రీ మహాదేవ ఆలయం నీటమునిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 8మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మరో 48గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కన్నూర్‌, కోజికోడ్‌, వయనాడ్‌, పాలక్కాడ్‌, త్రిస్సూర్‌, ఇడుక్కి, అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో 9 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆ జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలతో తమిళనాడుకు వరద ముప్పు ఉంది.

Also Read: రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రత్నభాండాగారం మూడోగది

Advertisment
Advertisment
తాజా కథనాలు