Kerala Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 8మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 48గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
kerala Rains: కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం
కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు నీటమునిగాయి. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1వ తేదీ వరకు కేరళలో వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Kerala rains: కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు..విద్యా సంస్థలు మూసివేత!
కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Rains) ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరాయి. దీంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.