Weather: మన దగ్గర మండుతున్న ఎండలు.. ఆ రాష్ట్రంలో 3 రోజులుగా దంచికొడుతున్న వానలు!

దేశవ్యాప్తంగా ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు జమ్మూ-కశ్మీర్‌ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల చాలాచోట్ల రోడ్లు తెగిపోగా, ఇండ్లు నీటమునగడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటలపాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు కోరారు.

New Update
Weather: మన దగ్గర మండుతున్న ఎండలు.. ఆ రాష్ట్రంలో 3 రోజులుగా దంచికొడుతున్న వానలు!

Jammu and Kashmir: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రభుత్వాలు సైతం ప్రజలకు కీలక ప్రకటన జారీ చేస్తున్నాయి. అవసరమైతే తప్పా అనవసరంగా బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నాయి. ఇదిలావుంటే.. మరోవైపు జమ్మూ-కశ్మీర్‌ను మూడురోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల వల్ల చాలాచోట్ల రోడ్లు తెగిపోగా, ఇండ్లు నీటమునగడంతో జనాలు అవస్థలు పడుతున్నారు.

24 గంటల్లో మరింత పెరిగే అవకాశం..
ఈ విపత్తు కారణంగా ఇప్పటికే జమ్మూ-శ్రీనగర్ హైవే, మొఘల్ రోడ్డుతోపాటు మరికొన్ని రహదారులు మూసివేశారు. NH-44 రహదారిపై ప్రయాణం చేయవద్దని సూచించారు. శ్రీనగర్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు రాబోయే 24 గంటల్లో మరింత వర్షాలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భారీ వరదల కారణంగా జీలం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులిచ్చారు. జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయని, రాబోయే 24 గంటలపాటు ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు