Abu Dhabi: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు!

యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడింది. ఎన్సీఎం రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది.

Abu Dhabi: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు!
New Update

Heavy Rainfall in UAE: భారీ వర్షాలు, వరదలతో యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) అతలాకుతలమవుతోంది. పోటెత్తిన వరదల ధాటికి రహదారులు కాలువలుగా మారాయి. ప్రధాన నగరాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది.

రెడ్ అండ్ అంబర్ అలర్ట్..
యూఏఈ వ్యాప్తంగా భారీగా వడగండ్ల వానలు కురుస్తుండటంతో యూఏఈలో జాతీయ వాతావరణ శాఖ (ఎన్సీఎం) కూడా రెడ్ అండ్ అంబర్ అలర్ట్ (Red and Amber Alert) జారీ చేసింది. అబుదాబిలోని (Abudabi) పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు యూఏఈ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. అబుదాబి, దుబాయ్ (Dubai), రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. రస్ అల్ ఖైమా, ఫుజైరాలోని కొన్ని ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమై, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పరిస్థితులు సాధారణం అయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

ఇది కూడా చదవండి : Hyderabad: హైదరాబాద్‌ జోలికొస్తే మిమ్మల్ని వదలం.. ఏపీ నాయకులకు తెలంగాణ నేతలు వార్నింగ్

బుర్జ్ ఖలీఫాపై పిడుగు..
వడగండ్ల వానలు, పిడుగులతో దుబాయ్ దద్దరిల్లింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత కట్టడం బుర్జ్ ఖలీఫాపై (Burj Khalifa) కూడా పిడుగు పడింది. అయితే ఇందులో ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ వారం రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సందర్శకులు సైతం పర్యావరణ విపత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

#burj-khalifa #uae #heavy-rainfall-in-uae
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe