Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది.
ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. ఆదివారం తెల్లవారుజాముకల్లా ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి (Amaravati) వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందన్నారు.
ఆదివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. శనివారం కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మత్స్యకారులు (Fishermen) సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఇది తుఫానుగా మారే సూచనలు లేవని వాతావరణ శాఖ నిపుణులు వివరించారు.
Also Read: 94 రైళ్లు రద్దు..41 రూట్ మార్పు!