Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో మరింత బలపడనుంది. ఆ తర్వాత ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రా అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Also Read:USA: చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..కాల్పుల తర్వాత ట్రంప్‌కు భారీగా మద్దతు