Rain Alert in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వానలు కురవనున్నాయి. ఇటు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఇప్పటికే వరుణుడు విశ్వరూపం ప్రదర్శిస్తుండగా అటు ఉత్తరాంధ్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని చాలా జల్లాలో హై అలెర్ట్ కొనసాగుతుండగా 5 జిల్లాలకు ఆరెంజ్, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
తెలంగాణలో బీభత్సం సృష్టిస్తోన్న వర్షాలు:
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు మిథున్(Mithun) సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ప్రగతినగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న మృతదేహాన్ని రెస్క్యూ టీమ్‌లు నాలుగు గంటలకు పైగా శ్రమించి బయటకు తీసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం నగరవాసుల్లో టెన్షన్ నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇద్దరు మహిళా రైతు కూలీలు సహా ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు బలయ్యారని సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు బాధితులతో పాటు మరో నలుగురు వ్యవసాయ పొలాల్లో పని చేస్తున్నారు.
ఏపీపైనా వరుణుడు దాడి:
భారీ వర్షాలతో వీధులన్నీ జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రత్యేక బృందాలను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్(GHMC) పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడతోపాటు మరికొన్ని కాలనీల్లో వరద నీటిలో మునిగిపోయిన వాహనాలను ఎత్తేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడ్డారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అటు అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ALSO READ: హైదరాబాద్‌లో విషాదం.. నాలాలోపడి చిన్నారి మృతి